భారత్‌ను అభిమానించే విదేశీ క్రికెటర్లు ఎంతోమంది. వివిధ సందర్భాల్లో వాళ్లు తమ ప్రేమను చాటుతుంటారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌కు కూడా భారత్ అంటే ఎనలేని ప్రేమ. అందుకే తన కూతురికి 'ఇండియా' అని పేరు పెట్టుకున్నాడు. తాజాగా అతను మరోసారి భారత్‌పై అభిమానాన్ని చాటాడు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం చేశాడు. ఓ కార్యక్రమం కోసం భారత్‌కు వచ్చిన అతను ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ను సందర్శించి అక్కడి నదిలో స్నానం చేశాడు.
'ఎంత తిరిగితే.. అంత ప్రేమలో పడుతూనే ఉన్నా' - kevin pietersen with chicken
భారత్‌లోని సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతిని విదేశీయులు బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా మనదేశంలో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీరోడ్స్ గంగానదిలో పుణ్యస్నానం ఆచరిస్తూ కనిపించాడు. మరో క్రికెటర్ ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ గిరిజన స్థానికులతో కలిసి భోజనం చేశాడు.

" పవిత్ర గంగా నదిలోని చల్లని నీటిలో స్నానమాచరించడం ద్వారా శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనాలు చేకూరతాయి"అని నదిలో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.
మరోవైపు ఖడ్గమృగాల సంరక్షణపై కాజీరంగా నేషనల్ పార్క్‌లో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొంటున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అక్కడి స్థానికులతో కలిసి భోజనం చేశాడు. బొంగుల్లో వండుతున్న చికెన్‌తో పాటు అక్కడి స్థానికులతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు. "భోజనం తయారవుతోంది. భారత్‌లో ఎంత ఎక్కువగా పర్యటిస్తున్నానో.. అంతలా ప్రేమలో పడుతూనే ఉన్నా" అని కెవిన్ అన్నాడు.