ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడం వల్ల సిరీస్ 1-0 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో 22 వికెట్లతో ఆకట్టుకున్న ఇంగ్లీష్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్.. ఈ సిరీస్లో విఫలమవడం పట్ల ఆ జట్టు కెప్టెన్ జో రూట్ స్పందించాడు. టెస్టు క్రికెట్లో ఆర్చర్ ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
"కొన్ని సార్లు బౌలింగ్ అత్యుత్తమంగా పడుతుంది.. కొన్ని సార్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు. అందువల్ల టెస్టు ఫార్మాట్లో రాణించడం కష్టమని ఆర్చర్ అనుకుంటున్నాడు. సిరీస్కు ముందు అతడిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడే ఆర్చర్ కెరీర్ ప్రారంభమైంది. మానసికంగా, భౌతికంగా అతడు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతడు ఎంతో ప్రతిభ గల ఆటగాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు" -జో రూట్ ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్.
ఈ సిరీస్లో ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి కేవలం రెండే వికెట్లు తీశాడు.