వెస్టిండీస్‌తో నేడు(జులై 16) జరగబోయే రెండో టెస్టు నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌ను తప్పించారు. బయో సెక్యూర్ నిబంధనలను అతిక్రమించడమే ఇందుకు కారణం. ఫలితంగా రెండుసార్లు కొవిడ్ పరీక్షలు చేయడం సహా ఐదు రోజులు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని ఈ మ్యాచ్‌లో ఆర్చర్ ఆడటం లేదని ఈసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయమై స్పందించిన ఆర్చర్.. తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు. తన చర్యల వల్ల వచ్చే పరిణామాలను పూర్తిగా అంగీకరిస్తున్నానని వెల్లడించాడు.