తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ నుంచి ఆర్చర్ ఔట్.. రాజస్థాన్​కు ఎదురుదెబ్బ - జోఫ్రా ఆర్చన్ రాజస్థాన్ రాయల్స్

మోచేతి గాయం కారణంగా ఈ ఐపీఎల్​ సీజన్​కు దూరమయ్యాడు ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్. ఇతడు గత రెండేళ్ల నుంచి రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Jofra Archer out of IPL with stress fracture
ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్

By

Published : Feb 6, 2020, 5:19 PM IST

Updated : Feb 29, 2020, 10:23 AM IST

ఐపీఎల్ కొత్త సీజన్ మొదలు కావడానికి మరో నెలపైగా సమయం ఉంది. ఇలాంటప్పుడే రాజస్థాన్ రాయల్స్​కు ఎదురుదెబ్బ తగిలింది. గత రెండేళ్లుగా ఈ ఫ్రాంచైజీకి ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్.. ఈ సీజన్​కు దూరమయ్యాడు. మోచేతికి గాయం కావడం వల్ల వైదొలిగాడు.

ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​, శ్రీలంకతో టెస్టు సిరీస్​ నుంచి తప్పుకున్న ఆర్చర్.. ఐపీఎల్​కు అందుబాటులో ఉండటం లేదని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్న ఆర్చర్​కు కనీసం రెండు నెలలైనా విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.

రాజస్థాన్ రాయల్స్ ఆల్​రౌండర్ జోఫ్రా ఆర్చర్

ఇటీవలే సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​ ఆడిన ఆర్చర్.. కుడి మోచేతికి పుండ్లు కావడం వల్ల ఆ సిరీస్​లోని మిగతా మ్యాచ్​లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఇదే జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్​లోనూ ఆర్చర్ లేడు. వచ్చే నెల్లో జరిగే టెస్టు సిరీస్​కు పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే ఐపీఎల్​కు దూరమయ్యాడు. మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది ఐపీఎల్ 13వ సీజన్.

2018లో ఐపీఎల్​లో అడుగుపెట్టిన ఆర్చర్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆ సీజన్​లో 15 వికెట్లు తీశాడు. తర్వాతి ఏడాది 11 వికెట్లు తీయడం సహా బ్యాట్​తోనూ మెరిశాడు.

ఇదీ చదవండి: జోఫ్రా జోస్యం మళ్లీ నిజమైంది!

Last Updated : Feb 29, 2020, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details