ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ పెట్టిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ఆల్‌రౌండర్ క్రికెట్లోకి రాకుంటే ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరేవాడని ఆమె పేర్కొనడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
'మొయిన్ క్రికెట్ ఆడకుంటే ఐసిస్‌లో చేరేవాడు' - తస్లీమా నస్రీన్ ఐసిస్
ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట దుమారం రేపింది. ఈ విషయంపై చాలామంది ఆమెను దుయ్యబట్టారు.
మొయిన్ అలీ
"మొయిన్ అలీ క్రికెట్లో చిక్కుకోకుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరేవాడు" అని తస్లీమా ట్వీట్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెటర్లు జోఫ్రా ఆర్చర్, బెన్ డకెట్ సహా సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది తస్లీమా ట్వీట్‌ను తప్పుబట్టారు. ఇలా వివాదాలు రాజేయడం తస్లీమాకు అలవాటే అని దుయ్యబట్టారు. అయితే తాను సరదాకే ఈ ట్వీట్ వేశానని చాలామందికి తెలిసినా దీన్ని వివాదం చేస్తున్నారని, తనను అవమానిస్తున్నారని తస్లీమా తర్వాత మరో ట్వీట్ వేసింది.