తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2020, 8:15 AM IST

ETV Bharat / sports

విండీస్​తో మూడో టెస్టు ఆడకపోవచ్చు: ఆర్చర్​

మాంచెస్టర్​ వేదికగా వెస్టిండీస్​తో సిరీస్​లో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్​లో ఆడకపోవచ్చని అంటున్నాడు ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​. తొలి టెస్టు తర్వాత బబుల్​ నిబంధనలను అతిక్రమించి తాను ఇంటికి వెళ్లిన కారణంగా తనపై సోషల్​మీడియాలో జాతివివక్ష వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలిపాడు.

Jofra Archer could miss third Test after revealing racist abuse
విండీస్​తో మూడో టెస్టుకు ఆర్చర్​ దూరం.. కారణమదేనా!

వెస్టిండీస్​తో సిరీస్​లో​ నిర్ణయాత్మక మూడో టెస్టులో తాను బరిలోకి దిగలేకపోవచ్చని ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​ అంటున్నాడు. బయో బబుల్​ నిబంధనలు అతిక్రమించానని తనపై కొంతమంది జాతివివక్ష వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని చెప్పాడు.

విండీస్​తో తొలి టెస్టు తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఆర్చర్​ ఇంటికి వెళ్లాడు.దాంతో అతణ్ని రెండో టెస్టు నుంచి తప్పించడం సహా జరిమానా కూడా విధించారు. చివరిదైన మూడో టెస్టులో ఆడేందుకు అనుమతిచ్చారు. అయితే నిబంధనలు ఉల్లఘించడపై సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తనను దూషించారని దాంతో మానసిక బాధ అనుభవిస్తున్నట్లు ఆర్చర్​ తెలిపాడు.

"మానసికంగా 100 శాతం సిద్ధంగా ఉంటేనే ఈ వారం క్రికెట్​ ఆడతా. ఒకవేళ నేను మ్యాచ్​లో ఆడి.. గంటకు 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేయకపోతే అదో వార్తగా మారుతుంది. నేనెప్పుడు బరిలో దిగినా వంద శాతం ప్రదర్శన చేస్తా. అలాంటి భరోసా ఇవ్వలేకపోయినప్పుడు మైదానంలో అడుగుపెట్టాలని అనుకోను. గత కొన్ని రోజులుగా నా జాతిని దూషిస్తూ ఉన్న ఇన్​స్టాగ్రామ్​ పోస్టులు చూశా. ఇక ఓపికగా ఉండలేకపోతున్నా. ఇప్పటి వరకు జరిగింది చాలు. అందుకే ఈ విషయంపై ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు (ఈసీబీ)కి ఫిర్యాదు చేశా. అవగాహనారాహిత్యంతో తప్పు చేశా. దానికి తగిన శిక్ష అనుభవించా. నేనేం పెద్ద నేరం చేయలేదు" అని జోఫ్రా ఆర్చర్​ పేర్కొన్నాడు. తాను అందుబాటులో లేకున్నా ఇంగ్లాండ్​ బౌలింగ్​ వనరులకు ఎలాంటి కొరతలేదని అతను అన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన స్టోక్స్​కు ఆర్చర్​ ధన్యవాదాలు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details