అతిగా ప్రవర్తిస్తే, ఐసీసీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రికెటర్లు నిషేధానికి గురవడం సహజమే. అయితే క్రికెటర్‌పై వివక్షపూరితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఓ అభిమానిపై నిషేధం విధించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.
ఇంగ్లీష్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్‌పై ఓ అభిమాని.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఆటలో ఈ సంఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.