ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో భాగంగా రూట్ 22 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 226 పరుగులు సాధించాడు. చాలా కాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న రూట్ ఎట్టకేలకు డబుల్ సెంచరీతో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. మొత్తంగా ఇది రూట్‌కు టెస్టు కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ.
269/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 207 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. ఓలీ పాప్(75) అర్ధశతకంతో మెరిశాడు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.