తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూట్​ రికార్డు.. ఇంగ్లాండ్​ ఏడో బ్యాట్స్​మన్​గా - joe root record

టెస్టు క్రికెట్​లో ఇంగ్లాండ్​ కెప్టెన్ రూట్ రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఫీట్​ నమోదు చేశాడు.

root
రూట్​

By

Published : Jan 16, 2021, 1:42 PM IST

ఇంగ్లాండ్​ టెస్టు సారథి జో రూట్​ మరో ఘనత సాధించాడు. టెస్టు​ల్లో తమ​ జట్టు తరఫున 8 వేల పరుగులు పూర్తి చేసిన ఏడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

శ్రీలంకతో తొలి టెస్టు ఆడుతూ రూట్ ఈ మార్క్​ అందుకున్నాడు​. ​ఇది అతడికి 98వ టెస్టు. ఇందులో భాగంగా శుక్రవారం రెండో రోజు ఆటలో తన 18వ సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ పోరులో ద్విశతకం(228) బాది.. తన ఖాతాలో నాలుగో డబుల్​ సెంచరీని వేసుకున్నాడు.

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 421 పరుగులకు ఆలౌటైంది. అంతకు ముందు ​శ్రీలంక తొలి ఇన్నింగ్స్​లో 135 పరుగులకు ఆలౌట్​ అయింది. ఫలితంగా ఇంగ్లీష్​ జట్టు 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చూడండి: కోహ్లీ వీడియోలతో టెక్నిక్స్​ నేర్చుకుంటాను: రూట్

ABOUT THE AUTHOR

...view details