తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఝార్ఖండ్​ పోలింగ్​: ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ - ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ధోనీ

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ... మైదానంలో కాకుండా ఈ సారి పోలింగ్​ స్టేషన్​లో​ కనిపించాడు. గురువారం జరిగిన ఝార్ఖండ్ మూడో విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. భార్య సాక్షి సింగ్​తో కలిసి పోలింగ్​ కేంద్రం నుంచి బయటకు వస్తూ అభిమానులను పలకరించాడు.

MS Dhoni vote
ఝార్ఖండ్​ పోలింగ్​: ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

By

Published : Dec 12, 2019, 5:11 PM IST

ఝార్ఖండ్​లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం రాంచీలో.. టీమిండియా మాజీ సారథి, వికెట్​ కీపర్​ మహేంద్ర సింగ్‌ ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. భార్య సాక్షి సింగ్​తో కలిసి కేంద్రం నుంచి బయటకు వస్తూ, అభిమానులను పలకరించాడు.

ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమిపాలైన తర్వాత నుంచి ధోనీ.. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. తొలుత రెండు నెలలు సైన్యంలో సేవలందించాడు. తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లతో సిరీస్‌లకూ అందుబాటులో లేడు.

ఫలితంగా అతడి పునరాగమనంపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఐపీఎల్ తర్వాతే కెరీర్​కు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాడని అతడి సన్నిహితులు ఇటీవలే చెప్పారు.

ధోనీ

ఇవీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details