టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు నమోదు చేస్తూ ఫుల్‌జోష్‌లో ఉంది భారత మహిళా క్రికెట్ జట్టు. ఈ ఆనందాన్ని సభ్యులు అందరూ అస్వాదిస్తుండగా, జెమీమా రోడ్రిగ్జ్ మాత్రం డ్యాన్స్‌తో అలరిస్తుంది. ఇటీవలే సెక్యూరిటీ గార్డ్‌తో కలిసి చిందేసిన ఈ క్రికెటర్.. ఇప్పుడు బాలీవుడ్ పాటకు ఆస్ట్రేలియా చిన్నారులతో కలిసి నృత్యం చేసింది. ఈ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఇందులో సహచర ప్లేయర్ హర్లీన్ దేఓల్తో కలిసి చిన్నారులకు డ్యాన్స్ నేర్పింది జెమీమా. 'లవ్ ఆజ్ కల్ 2' సినిమాలోని 'హో మై గలత్' పాటకు కాలు కదిపింది.