టీ20 ప్రపంచకప్లో టీమిండియా మహిళా జట్టు సెమీస్కు చేరుకుంది. న్యూజిలాండ్తో ఈరోజు జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలిచి, హాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. అందరి కంటే ముందు సెమీస్ చేరామన్న ఆనందం హర్మన్సేనలో కనిపించింది. అయితే ఈ మ్యాచ్కు ముందే ఓ సెక్యూరిటీ గార్డ్తో స్టెప్పులేసి అదరగొట్టింది యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్జ్.
'లవ్ ఆజ్కల్' సినిమాలోని 'హా మై గలత్' పాటకు కాలు కదిపింది జెమీ. ఆ వీడియోను ఐసీసీ ట్వీట్ చేయగా, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ రీట్వీట్ చేశాడు. ఓ హాస్యభరిత క్యాప్షస్ జోడించాడు.