తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్: ఉనద్కత్​ ఎలా రనౌటయ్యాడో చూశారా..?

ఇండియా-ఏ, ఇండియా-బీ మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఇండియా-ఏ బౌలర్ ఉనద్కత్​ రనౌటైన తీరు అందరిలో నవ్వులు కురిపించింది.

ఉనద్కత్

By

Published : Nov 1, 2019, 10:19 AM IST

Updated : Nov 1, 2019, 11:05 AM IST

దేవ్​ధర్​ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ,బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో బీ-టీమ్​ ఘనవిజయం సాధించింది. 303 పరుగులను ఛేదించే క్రమంలో.. ఇండియా-ఏ జట్టు తడబడింది. అయితే... ఆ జట్టుకు చెందిన బ్యాట్స్​మెన్​ జయదేవ్​ ఉనద్కత్​ రనౌటైన తీరు అందరిలో నవ్వులు పూయించింది. విచిత్రంగా అవుటై పెవిలియన్​ చేరాడు.

ఏం జరిగింది..

44వ ఓవర్​.. ఐదో బంతి.. షహ్​బాజ్ నదీమ్​ బౌలింగ్. క్రీజు నుంచి ముందుకొచ్చి బంతిని డిఫెన్స్ ఆడాడు ఉనద్కత్. కానీ మళ్లీ క్రీజులోకి వెళ్లడం మర్చిపోయాడు. బంతిని అందుకున్న ఫీల్డర్​ కీపర్ పార్ధివ్ పటేల్​కు త్రో వేశాడు. అంతే పార్ధివ్ వికెట్లను గిరాటేయగా.. అంపైర్​ వేలెత్తాడు. ఇక ఆశ్చర్యపోవడం ఉనద్కత్​ వంతైంది. నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ పూర్తి వీడియో మీకోసం.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన బీ-జట్టు 302 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (113), బాబా అపరాజిత్ (101) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్​-ఏ జట్టు 194 పరుగులకే ఆలౌటైంది. సారథి హనుమ విహారి పోరాడి అర్ధసెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.

ఇవీ చూడండి.. బుమ్రాను టీజ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్

Last Updated : Nov 1, 2019, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details