తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా ముందస్తు 'రక్షా బంధన్​' వేడుక - jasprith bumrah raksha bandhan with his sister

భారత క్రికెటర్​ జస్​ప్రీత్​​ బుమ్రా రెండు రోజుల ముందుగానే తన సోదరి జుహికతో కలిసి రాఖీ పండుగ చేసుకున్నాడు. వెస్టిండీస్​తో ఆగస్ట్​ 22 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​ కోసం ప్రయాణం కానున్నాడీ స్టార్​ పేసర్​.

బుమ్రా ముందస్తు 'రక్షా బంధన్​' వేడుక

By

Published : Aug 14, 2019, 8:50 AM IST

Updated : Sep 26, 2019, 10:59 PM IST

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన పేసర్​ జస్​ప్రీత్​​ బుమ్రా మంగళవారం తన సోదరితో రాఖీ కట్టించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించి ఫొటోలు షేర్​ చేశాడు. దేశవ్యాప్తంగా ఆగస్టు​ 15న రక్షాబంధన్​ పండుగ జరగనుంది.

" జుహిక... నేను టీమిండియా డ్యూటీలో వెళ్తున్నాను. అందువల్ల రక్షా బంధన్​కు ఇక్కడ ఉండలేకపోతున్నా. అయినా నీతో రాఖీ కట్టించుకునే అవకాశాన్ని నేను వదులుకోలేను. ఎల్లప్పుడూ నా సోదరిగా నాకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు".
--
జస్​ప్రీత్​ బుమ్రా, భారత క్రికెటర్​

కరేబియన్లతో ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ పయనమవనున్నాడు బుమ్రా. ఆగస్టు 17-19 మధ్య ఇరు జట్లు మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడతాయి. 2019 ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు.

భారత్​-వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా నేడు చివరి వన్డే జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ మ్యాచ్​లో గెలిచి వన్డే సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది కోహ్లీ సేన.

ఇదీ చదవండి...సిరీస్​ కోసం భారత్-పరువు కోసం విండీస్​

Last Updated : Sep 26, 2019, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details