టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అనేకమంది అభిమానులున్నారు. అతడి మీద ఉన్న అభిమానంతో మ్యాచ్ జరుగుతున్న స్టేడియాలకు వెళ్లి బుమ్రాను ఉత్సాహపరుస్తూ ఉంటారు. అదే జాబితాలో ఇప్పుడు ఓ బుల్లి అభిమాని చేరాడు. స్టాండ్స్‌లో ఉన్న ఈ బుల్లి అభిమాని.. పేసర్ బుమ్రా పేరును పలుకుతూ, బౌలర్‌ను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు. తనకు వచ్చిరాని మాటలతో 'బుమ్రా..బుమ్రా..' అంటూ అరచిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అడిలైడ్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీసేన ఆసీస్ ముందు 90 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్.