తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూకేకు బుమ్రా.. గాయంపై పర్యవేక్షణ - Jasprit Bumrah to seek opinions of three doctors in the UK

టీమిండియా పేసర్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యవేక్షణ నిమిత్తం ఈ పేసర్​​ను యూకే పంపుతున్నట్లు తెలిపింది.

బుమ్రా

By

Published : Oct 1, 2019, 12:51 PM IST

Updated : Oct 2, 2019, 5:51 PM IST

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు ముందు టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం బారినపడ్డాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. బుమ్రాకు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించేందుకు యూకే పంపుతున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

"అవును.. జస్​ప్రీత్​ బుమ్రా చికిత్స కోసం ఈ నెల మొదటి వారంలో లండన్ వెళ్లనున్నాడు. అతని వెంట ఎన్సీఏ హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఆశిస్‌ కౌశిక్‌ ఉంటాడు. బుమ్రాను ముగ్గురు నిపుణులతో కూడిన బృందం వేర్వేరుగా పర‍్యవేక్షిస్తుంది".
-బీసీసీఐ సీనియర్ అధికారి

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టెస్టు సిరీస్‌ నుంచి బుమ్రా వైదొలిగాడు. అతడి స్థానంలో ఉమేష్ యాదవ్​ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో తదుపరి సిరీస్‌కూ ఈ స్పీడ్​స్టర్​ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

ఇవీ చూడండి.. కోహ్లీని అధిగమించిన పాక్ క్రికెటర్

Last Updated : Oct 2, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details