టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వివాహంపై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే మోడల్, టీవీ ప్రజెంటర్ సంజనా గణేశన్ను బుమ్రా పెళ్లాడాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు వీరిద్దరి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
"ప్రేమ.. అది మిమ్మల్ని వెతుక్కొని వస్తే ఎంతో విలువైనది. మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈరోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం" అని బుమ్రా సంజనను వివాహమాడిన ఫొటోలను పోస్టు చేశాడు.