ఈ ఏడాది ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ పాటిన్సన్. ఈ క్రమంలోనే క్వారంటైన్ పూర్తి చేసుకుని.. తొలి ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించాడు. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ నుంచి తప్పుకున్న శ్రీలంక బౌలర్ మలింగ స్థానంలో పాటిన్సన్ను ఎంచుకుంది ఫ్రాంచైజీ.
మంగళవారం పాటిన్సన్ నెట్ ప్రాక్టీసు చేస్తున్న వీడియోను ముంబయి ఫ్రాంచైజీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పాటిన్సన్ మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ ఎవరైనా ఉంటారంటే అది బుమ్రా అని తెలిపాడు.