తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా రన్నింగ్.. అభిమానులు ఖుష్​

వెన్నెముక గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా పేసర్ బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా తాను పరుగెడుతున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

బుమ్రా

By

Published : Nov 3, 2019, 7:56 AM IST

Updated : Nov 3, 2019, 8:29 AM IST

వెన్నెముక గాయంతో ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడానికి శ్రమిస్తున్నాడు. తాజాగా బుమ్రా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో మైదానంలో పరుగెడుతూ కనిపిస్తున్నాడు. "నిలిచా.. పరుగెడుతున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంటే వేగంగా కోలుకుంటానని పరోక్షంగా చెబుతున్నాడు.

వెస్టిండీస్‌ సిరీస్‌ తర్వాత బుమ్రా మళ్లీ బంతి పట్టుకోలేదు. అతడి వెన్నెముక దిగువ భాగాన గాయమైంది. శస్త్రచికిత్స అవసరం అవుతుందేమోనని అంతా కంగారు పడ్డారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఎందుకంటే శస్త్రచికిత్స చేస్తే కనీసం 6-8 నెలలు ఆట నుంచి విరామం తీసుకోవాలి. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నాడు. రోజురోజుకూ మెరుగవుతున్నాడు. జనవరిలో లోగా అతడు జట్టులో చేరతాడని అంచనా వేస్తున్నారు.

అంతకు ముందు జిమ్‌లో సెల్ఫీ తీసుకొని "త్వరలో వచ్చేస్తున్నా.." అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దానికి ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియేల్లీ వ్యాట్‌ చిలిపిగా బదులిచ్చింది. 'బేబీ వెయిట్స్‌' అంటూ టీజ్‌ చేసింది. అతడు తక్కువ బరువులతో కసరత్తు చేయడమే ఇందుకు కారణం.

ఇవీ చూడండి.. విరాట్ 3 సెకండ్లలోనే ఓకే చెప్పేశాడు: దాదా

Last Updated : Nov 3, 2019, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details