టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. టీనేజ్‌లోని తన ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో తొలిసారిగా అవార్డు తీసుకున్నప్పటి ఫొటో, ఇటీవలే అవార్డు తీసుకుంటున్న మరో ఫొటో రెండింటినీ కలిపి పోస్ట్ చేశాడీ క్రికెటర్. అక్కడి నుంచి మొదలై, ఇక్కడ వరకు వచ్చానని ఓ వ్యాఖ్య జోడించాడు.
'అక్కడి నుంచి మొదలై.. ఇక్కడి వరకు' - bumrah bowling
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తను టీనేజ్‌లో ఉన్నప్పటి ఫొటోను ట్విట్టర్లో పంచుకొని, ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు. ప్రస్తుతం వన్డేల్లో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు బుమ్రా.
టీమిండియా బౌలర్ బుమ్రా
25 ఏళ్ల ఈ క్రికెటర్... చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. భారత క్రికెట్ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా... ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బుమ్రాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న ఆ సమయంలో కష్టాలను ఎదురొడ్డి నిలిచానని ఒకానొక సందర్భంలో చెప్పాడీ బౌలర్. చిన్నతనంలో ఎదురైన పరిస్థితులు తనను మరింత దృఢంగా తయారు చేశాయని అన్నాడు.