తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నింగ్​ బెల్స్​: బుమ్రా బౌలింగ్​లో పదును తగ్గిందా!

భారత పేస్​గుర్రం జస్ప్రీత్​ బుమ్రా మరోసారి నిరాశపర్చాడు. తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో వన్డేలో భారీగా పరుగులిచ్చుకొని వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. చివరిగా ఆడిన మూడు వన్డేల్లోనూ బుమ్రా ఒక్క వికెట్​ ఖాతాలో వేసుకోలేకపోయాడు. అందుకే ఈ ఏడాది ప్రపంచకప్​ ముంగిట ఇతడి ప్రదర్శన అభిమానులను కలవరపెడుతోంది.

jasprit bumrah not taking wickets is worrying sign for team india before T20 Worldcup 2020?
బుమ్రా బౌలింగ్​లో పరుగులు పిండేస్తున్నారు.?

By

Published : Feb 8, 2020, 12:42 PM IST

Updated : Feb 29, 2020, 3:13 PM IST

జస్ప్రీత్​ బుమ్రా.. టీమిండియా పేస్​ దళానికి సేనాని. ప్రపంచకప్​లో అతడి సత్తా ఏంటో నిరూపించాడు. అతడి యార్కర్లను ఎదుర్కోవడానికి ప్రపంచ స్థాయి బ్యాట్స్​మన్​ కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నం.. అలాంటి స్టార్​ బౌలర్​ వేసిన ఆఖరి ఓవర్లలో లోయర్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ పరుగులు పిండేసుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్​తో జరిగిన రెండో వన్డేలో 10 ఓవర్లు వేసిన జస్ప్రీత్​... 60 పరుగులిచ్చి ఒక్క విక్కెట్ కూడా​ సాధించలేకపోయాడు.

మూడు వన్డేల్లో నిల్​...

వెన్ను గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్​ వికెట్లు తీయడంలో ఇబ్బందులు పడుతున్నాడు. లైన్​ అండ్​ లెంగ్త్​ తప్పుతూ.. భారీగా ఎక్స్​ట్రాలు ఇచ్చుకుంటున్నాడు. తొలి వన్డేలో 13 వైడ్​లు వేయడం ఆశ్చర్యం. ఆఖరిగా ఆడిన 5 వన్డేల్లో.. 1 వికెట్​ మాత్రమే తీసి 5.13 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో వికెట్లు తీయకుండా కెరీర్​లో తొలిసారి ఓ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

కివీస్​ తోకతో కొట్టేశారు...

టాప్​, మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ను నియంత్రించినా.. లోయర్​ ఆర్డర్​ను ఔట్​ చేయడంలో ఇప్పటికీ కష్టాలు ఎదుర్కొంటున్నారు భారత బౌలర్లు. ఆఖరి ఓవర్లలో పరుగుల నియంత్రణ టీమిండియాకు కష్టంగా మారింది. తాజా మ్యాచ్​లో కివీస్​ తోకను అడ్డుకునేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఏకంగా తొమ్మిదో వికెట్​ వద్ద 76 పరుగుల భాగస్వామ్యం సాధించారు టేలర్​, జేమిసన్. ఫలితంగా ఆక్లాండ్​ మైదానంలో ఈ వికెట్​కు ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుగా రికార్డునూ సొంతం చేసుకుంది.

Last Updated : Feb 29, 2020, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details