ముంబయి ఇండియన్స్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నా.. సాధనలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇటీవలే టీవీ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌ను వివాహమాడిన బుమ్రా.. ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులు సహా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. రానున్న ఐపీఎల్ కోసం తిరిగి సన్నాహాలు ప్రారంభించిన బుమ్రా.. ప్రాక్టీస్ విషయాలను ట్విట్టర్లో షేర్ చేశాడు.
2021 ఐపీఎల్ కోసం బీసీసీఐ విధించిన కొవిడ్ మార్గదర్శకాల్లో భాగంగా బుమ్రా 7 రోజుల తప్పనిసరి క్వారంటైన్లో చేరాడు. ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు మినహా మిగతా వారందరికీ వారికి కేటాయించిన హోటల్ రూమ్‌లలో స్వీయ నిర్బంధం తప్పనిసరి చేసింది. చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.. తమ తొలి మ్యాచ్‌ను బెంగుళూరుతో ఏప్రిల్ 9న ఆడనుంది.
బెంగుళూరు ఆటగాళ్ల శిక్షణ షురూ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో ప్రాక్టీస్ ప్రారంభించారు. చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది ఆర్సీబీ. హెడ్ కోచ్ సైమన్ కటిచ్, ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హస్సన్ ఆధ్వర్యంలో క్రికెటర్లు సాధన షురూ చేశారు.