భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి, ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక మెయిడెన్లు(7) వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు తొలిస్థానంలో ఉన్న శ్రీలంకకు చెందిన కులశేఖర(6)ను అధిగమించాడు.
టీ20ల్లో స్టార్ పేసర్ బుమ్రా ప్రపంచ రికార్డు - cricket news
ఫాస్ట్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఎవరికి సాధ్యం కాని విధంగా టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకీ అదేంటంటే?
స్టార్ పేసర్ బుమ్రా
చివరి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గానూ నిలిచాడు. ఈ పోరులో న్యూజిలాండ్‌పై ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
కివీస్‌తో టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేసింది భారత్. సమష్టిగా రాణించిన కోహ్లీసేన.. వన్డే, టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. తొలి వన్డే హామిల్టన్‌లో ఈ బుధవారం జరగనుంది.
Last Updated : Feb 28, 2020, 11:57 PM IST