క్రికెట్లో జాతివివక్షపై క్రికెటర్లు డారెన్ సామీ, క్రిస్ గేల్, బ్రావో తర్వాత మరో వెస్టిండీస్ ప్లేయర్ జాసన్ హోల్డర్ తన గళాన్ని విప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్, డోపింగ్లతో సమానంగా జాతివివక్షనూ పరిగణించాలని విజ్ఞప్తి చేశాడు.
"డోపింగ్ లేదా క్రికెట్లో అవినీతికి విధించే జరిమానాతో సమానంగా జాత్యాహంకారానికి శిక్షలు ఉండాలి. సిరీస్ ప్రారంభమయ్యే ముందు యాంటీ డోపింగ్, అవినీతి నిరోధక అంశంతో పాటు జాత్యాహంకారంపై ఆటగాళ్లందరికీ అర్థమయ్యేలా చెప్పాలి . ఆ సందేశంతో దానిపై మరింత అవగాహన రావాలి. క్రికెట్లో నాకు ఇప్పటి వరకు ఎలాంటి జాతివివక్ష ఎదురవ్వలేదు. కానీ, మన చుట్టూ ఉన్న ఆటగాళ్లు దీని గురించి ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలపై కచ్చితంగా చర్చ అవసరం."
- జాసన్ హోల్డర్, వెస్టిండీస్ క్రికెటర్