తెలంగాణ

telangana

ETV Bharat / sports

నిషేధంపై శ్రీశాంత్​కు ఊరట - bcci

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న శ్రీశాంత్​కు భారీ ఊరట లభించింది. నిషేధాన్ని ఎత్తివేయాలని బీసీసీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

శ్రీశాంత్

By

Published : Mar 15, 2019, 2:26 PM IST

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్​కు ఊరట లభించింది. శ్రీశాంత్​పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ బీసీసీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఈ ఫాస్ట్ బౌలర్ దాఖలు చేసిన పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జస్టిస్ అశోక్ కుమార్ భూషన్, జస్టిస్ కేఎమ్ జోసెఫ్​లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం శ్రీశాంత్​పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటింంచింది. అటు బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ విధానాన్ని సుప్రీం తప్పుబట్టింది. నిషేధాన్ని మూడు నెలల్లో పునఃసమీక్షించుకోవాలని కోరింది.

ఈ విషయమై స్పందించిన సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ సుప్రీం ఆదేశాలు మాకు అందాల్సి ఉందన్నారు. దీని గురించి సీఓఏలో చర్చిస్తామని తెలిపారు. మార్చి 18న జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details