యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్, సీనియర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి టెస్టులో కేవలం 4 ఓవర్లే వేసి మైదానం వీడాడీ పేసర్. తొడ కండరాల గాయం కారణంగా మళ్లీ బౌలింగ్‌కు దిగలేదు.
యాషెస్ మొత్తానికి దూరమైన అండర్సన్ - ashes
ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ అండర్సన్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో క్రేగ్ ఓవర్టన్ను తీసుకుంది ఇంగ్లీష్ జట్టు.

అండర్సన్
ఐర్లాండ్‌తో టెస్టులోనూ ఈ కారణంతోనే ఆడలేదు. యాషెస్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి కోలుకున్నా.. మళ్లీ కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఇంకా గాయం నుంచి కోలుకోని అండర్సన్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని జట్టు ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ క్రేగ్ ఓవర్టన్ను తీసుకుంది.
ఇవీ చూడండి.. 'అందుకే అతడ్ని ఎంపిక చేయలేదు'
Last Updated : Sep 28, 2019, 9:52 PM IST