తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2021, 5:05 PM IST

ETV Bharat / sports

ఆ వికెట్​తో అండర్సన్​ అరుదైన రికార్డు

శ్రీలంకతో గాలె మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో అరుదైన ఘనత సాధించాడు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. లంక క్రికెటర్ డిక్విల్లా వికెట్​తో 30 సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు.​

James Anderson picks 30th five-wicket haul, goes clear of McGrath
ఆ వికెట్​తో అండర్సన్​ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్​ పేసర్ జేమ్స్​ అండర్సన్​ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 30 సార్లు 5 వికెట్లు తీసిన ఆరో బౌలర్​గా నిలిచాడు. అంతకుముందు అతడు 29సార్లు ఐదు వికెట్లు తీసి.. ఆసీస్​ దిగ్గజం గ్లెన్​ మెక్​గ్రాత్​తో 6వ స్థానాన్ని పంచుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 6 వికెట్లు తీసిన అతడు ఈ జాబితాలో మెక్​గ్రాత్​ను 7వ స్థానానికి నెట్టాడు.

అత్యధికంగా 5 వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంగ దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ అగ్రస్థానంలో (67సార్లు) ఉన్నాడు. ఆ తర్వాత షేన్ వార్న్(37), సర్ హాడ్లీ(36), అనిల్ కుంబ్లే(35), హెరాత్(34)​ ఉన్నారు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వాళ్లలో 4వ స్థానంలో ఉన్నాడు అండర్సన్. ఇక పేసర్లలో అయితే 606 వికెట్లతో అతడే నెం.1. మరో 14 వికెట్లు తీస్తే భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను దాటి.. మూడో స్థానానికి చేరుకుంటాడు. పేసర్లలో 5 వికెట్లు తీసిన వారిలో రిచర్డ హాడ్లీ మాత్రమే (36సార్లు) అండర్సన్ కన్నా ముందున్నాడు.

ఇదీ చూడండి:ఇంగ్లాండ్​పై 3-0 తేడాతో భారత్​దే గెలుపు: హాగ్

ABOUT THE AUTHOR

...view details