తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లలో అండర్సన్​​కు చోటు

టెస్టు క్రికెట్​లో 600 వికెట్లు సాధించి రికార్డుకెక్కిన ఇంగ్లాండ్​ ఫాస్ట్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​ను ప్రశంసించాడు టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ. తాను ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లలో జిమ్మీ ఒకడని అభిప్రాయపడ్డాడు.

James Anderson
అండర్సన్​

By

Published : Aug 26, 2020, 4:50 PM IST

ఇంగ్లాండ్‌ సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో 600 వికెట్లు పడగొట్టిన ఏకైక పేసర్‌గా ఇటీవల రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్​తో జరిగిన మూడో టెస్టులో భాగంగా ఐదురోజున ఈ ఘనత సాధించాడు. దీంతో పలువురు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ జేమ్స్​ను పొగడ్తలతో ముంచెత్తాడు.

"600 వికెట్లు సాధించిన అండర్సన్‌కు అభినందనలు. నేను ఎదుర్కొన్న ఉత్తమ బౌలర్లలో కచ్చితంగా జిమ్మీ ఒకడు" అని విరాట్‌ ట్వీట్‌ చేశాడు.

2014 ఇంగ్లాండ్‌ టూర్‌లో జిమ్మీ నాలుగు సార్లు కోహ్లీని ఔట్‌ చేశాడు. ఆ ఏడాది పర్యటనలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు.

600 వికెట్లలో భారత బ్యాట్స్​మెన్​నే ఎక్కువసార్లు ఔట్ చేశాడు అండర్సన్. ఇందులో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్​వి 110 వికెట్లు ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియాపై 104 వికెట్లు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాపై 83, వెస్టిండీస్​పై 87 వికెట్లు సాధించాడు.

అలాగే సొంతగడ్డపై 384 వికెట్లను తీశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 50కి పైగా వికెట్లు పడగొట్టాడు.

అండర్సన్​

మొత్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు అండర్సన్. స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇది చూడండి చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్

ABOUT THE AUTHOR

...view details