తెలంగాణ

telangana

ETV Bharat / sports

రివర్స్​ స్వింగ్​తో అండర్సన్ మాయ చేస్తాడు​: సచిన్​ - సచిన్​ తెందూల్కర్​ వార్తలు

రివర్స్​ స్వింగ్​లో ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​ ఉత్తమ బౌలర్​ అని అభిప్రాయపడ్డాడు క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్.​ ఇటీవలే ట్విట్టర్ వేదికగా మాట్లాడిన లిటిల్​ మాస్టర్​ అనేక విషయాలు పంచుకున్నాడు.

James Anderson is one of the best exponents of the reverse swing: Sachin Tendulkar
జేమ్స్​ ఆండర్సన్​

By

Published : Jul 10, 2020, 11:44 AM IST

ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​పై లిటిల్​ మాస్టర్​ సచిన్​ తెందూల్కర్​ ప్రశంసలు కురిపించాడు. రివర్స్​ స్వింగ్​లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన బౌలర్లలో జేమ్స్​ ఒకడని పేర్కొన్నాడు. ఇటీవలే ట్విట్టర్​ వేదికగా మాట్లాడిన సచిన్.. అనేక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

"జేమ్స్​ అండర్సన్​లో నేను గమనించిన విషయం ఏంటంటే.. బౌలింగ్​లో బంతిని అవుట్​ స్వింగ్​ వేస్తున్నట్లు పట్టుకుంటాడు. కానీ బంతిని రిలీజ్​ చేసేటప్పుడు వెనక్కి తీసుకుంటాడు. చాలా మంది బ్యాట్స్​మెన్ అతను ఎలా బౌలింగ్​ వేస్తున్నాడో తెలుసుకునేందుకు జేమ్స్ మణికట్టును చూస్తారు. ఆ సమయంలో అతను ఇన్​ స్వింగ్​ వేస్తున్నట్లు అనిపిస్తాడు. కానీ బంతిని వదిలేశాక అది ఎలా వస్తుందో తెలుసుకునే లోపే.. బ్యాట్స్​మన్​కు రెప్పపాటులో అందకుండా పోతుంది. బంతి దగ్గరకు వచ్చే ముందు కొత్తగా వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవ్వరూ అలా చేయలేరు. ప్రస్తుతం స్టువర్ట్​ బ్రాడ్​ కూడా ఆ విధంగానే బౌలింగ్​ చేస్తున్నాడు. కానీ, అండర్సన్​ చాలా కాలం క్రితమే అందులో దిట్ట. రివర్స్​ స్వింగ్​ వేసే ఉత్తమ బౌలర్లలో జేమ్స్ ఒకడు.

సచిన్​ తెందూల్కర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెకటర్​

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో సుదీర్ఘ విరామం అనంతరం.. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభమైంది. సౌతాంప్టన్​లో ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది.

సచిన్​ తెందూల్కర్​

ఇదీ చూడండి:బీసీసీఐతో ముగిసిన జోహ్రీ బంధం

ABOUT THE AUTHOR

...view details