తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో టెస్టుకు జట్టును ప్రకటించిన జాఫర్ - ఇంగ్లాండ్​తో టెస్టు జట్టును ప్రకటించిన జాఫర్

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5న టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ జట్టుతో బరిలో దిగితే బాగుంటుందంటూ తన జట్టును ప్రకటించాడు మాజీ ఆటగాడు వసీం జాఫర్.

Jaffer picks India's playing eleven for 1st Test against England
ఇంగ్లాండ్​తో టెస్టు జట్టును ప్రకటించిన జాఫర్

By

Published : Feb 1, 2021, 12:30 PM IST

ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు కోసం తన తుది జట్టును ప్రకటించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ఇందులో రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్​ను ఓపెనర్లుగా ఎంచుకోగా, పుజారా, కోహ్లీ, రహానే, పంత్​లను మిడిలార్డర్​కు ఎంపిక చేశాడు. అక్షర్ పటేల్, రవి అశ్విన్​లను స్పిన్నర్​లుగా తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ ఎడమచేతి వాటం స్పిన్నర్ చేతిలో ఇబ్బందిపడే అవకాశం ఉందని అందుకే అక్షర్​కు చోటు కల్పించానని వెల్లడించాడు జాఫర్. అలాగే పేసర్లుగా బుమ్రాతో పాటు పిచ్​ను బట్టి ఇషాంత్ శర్మ, సిరాజ్​లలో ఒకరిని ఎంచకోవాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్, శార్దూల్​లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపాడు.

జాఫర్ జట్టు: రోహిత్ , గిల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్, అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్/శార్దూల్, ఇషాంత్/సిరాజ్, బుమ్రా

ABOUT THE AUTHOR

...view details