తెలంగాణ

telangana

ETV Bharat / sports

జడేజా విషయంలో భారత్​కు ఎదురుదెబ్బ - నాలుగో టెస్టుకు జడేజా దూరం

టీమ్​ఇండియా క్రికెటర్​ జడేజా.. గాయం కారణంగా మూడో టెస్టు నుంచి వైదొలిగాడు. నాలుగో టెస్టుతో పాటు ఇంగ్లాండ్​ సిరీస్​లో తొలి టెస్టుకు దూరం కానున్నాడు.

jadeja
జడేజా

By

Published : Jan 9, 2021, 10:36 PM IST

టీమ్​ఇండియా మరో ఎదురుదెబ్బ. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడుతూ మూడు రోజు గాయపడిన భారత ఆల్​రౌండర్​ జడేజాకు ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఫలితంగా ఈ మ్యాచ్​తో పాటు​ నాలుగు టెస్టుకు దూరం కానున్నాడు.

తొలి ఇన్నింగ్స్​లో స్టార్క్​ వేసిన షార్ట్​ పిచ్ బంతి తాకి జడేజా ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. స్కానింగ్ చేసిన వైద్యులు అతడి వేలి ఎముక పక్కకు జరిగినట్లు గుర్తించారు. దాదాపు విరిగే దశకు చేరుకున్నట్లు చెప్పారు. వెంటనే సర్జరీ చేసి చికిత్సనందించి, ఆరు వారాల విశ్రాంతి అవసరమని తెలిపారు. దీంతో వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరగబోయే తొలి టెస్టుకు జడేజా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి : జడేజా, పంత్ గాయాలపై అప్​డేట్​.. ఆడటం కష్టమే​!

ABOUT THE AUTHOR

...view details