తెలంగాణ

telangana

ETV Bharat / sports

''ఇట్స్ ఓకే' అన్నారంటే మంచిగా ఉన్నట్లు కాదు' - సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఊతప్ప

హీరో సుశాంత్ సింగ్ మృతిపై స్పందించిన క్రికెటర్ ఊతప్ప.. మానసిక ఒత్తిడి గురించి ఆప్తులతో మాట్లాడాలని సూచించాడు. ఎవరైనా 'ఇట్స్ ఓకే' అన్నారంటే అంతా సరిగా ఉన్నట్లు కాదని చెప్పుకొచ్చాడు.

''ఇట్స్ ఓకే' అంటే సరిగా ఉన్నట్లు కాదు'
ఊతప్ప సుశాంత్ సింగ్

By

Published : Jun 15, 2020, 8:15 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్.. మానసిక ఒత్తిడి భరించలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అందరిని కలచివేసింది. అయితే దీని గురించే మాట్లాడిన భారత క్రికెటర్ ఊతప్ప, మానసిక ఒత్తిడి విషయమై స్పందించాడు. ఎవరైనా సరే ఇట్స్​ ఓకే అన్నంత మాత్రాన అంతా మంచిగా ఉన్నట్లు కాదని, మనం డిప్రెషన్​ లాంటి వాటిని మనసులో దాచుకోకుండా.. స్నేహితులు, ఆప్తులతో చర్చించాలని అన్నాడు.

తాను సుశాంత్ మరణించిన విషయం జీర్ణించుకోలేకపోతున్నానని ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు ఊతప్ప. బాధల్ని బయటకు చెప్పుకోవాలని, మనం వాటిని అర్థం చేసుకున్న దానికంటే మానసిక స్థైర్యంతో ఉండాలని రాసుకొచ్చాడు. ఇట్స్ ఓకే అన్నంత మాత్రాన అంతా సరిగా ఉన్నట్లు కాదని అన్నాడీ క్రికెటర్.

ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన లైవ్​ చాట్​లో మాట్లాడుతూ.. తాను ఓ సందర్భంలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చాడు ఊతప్ప.

భారత సీనియర్ క్రికెటర్ ఊతప్ప

"2006లో క్రికెట్​లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 2009-2011 మధ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు విపరీతంగా నాకు వచ్చేవి. కొన్ని సందర్భాల్లో బాల్కానీపై నుంచి దూకి చనిపోయేందుకు ప్రయత్నించాను. అయితే ఏదో ఓ కారణంతో అగిపోయేవాడిని. అనంతరం ఈ ఆలోచనల నుంచి బయటపడేందుకు తీవ్ర కృషి చేశాను. ప్రతిరోజు నన్ను నేనుగా అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కొంతమంది సహాయం తీసుకున్నాను. ఈ పరిస్థితుల నుంచి చివరికి బయటపడ్డాను. ఓ మనిషిగా రూపుదిద్దుకున్నాను. ఈ పరిస్థితి నాకు కొన్ని అనుభవాలను నేర్పించింది. క్రమంగా సానుకూలంగా అలోచించటం మొదలుపెట్టాను. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల, అనుకూల పరిస్థితులను సమతుల్యం చేసుకుంటా జీవించాలి. అప్పుడే జీవితం సరైన రీతిలో ముందుకు సాగుతుంది" -రాబిన్​ ఉతప్ప, టీమిండియా సీనియర్ క్రికెటర్​

ప్రస్తుతం ఈ క్రికెటర్ ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లాక్​డౌన్​తో టోర్నీ నిరవధిక వాయిదా పడింది. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్యలో దీనిని నిర్వహించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details