తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గాన్​తో మ్యాచ్​కు రెడీ: విజయ్​ శంకర్​ - ప్రపంచకప్​ 2019

గాయం నుంచి కోలుకొని అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​కు సిద్ధమయ్యాడు భారత ఆల్​రౌండర్ విజయ్ శంకర్. పాక్​పై ప్రదర్శన తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిదని చెప్పాడు.

అఫ్గానిస్థాన్​​తో మ్యాచ్​కు విజయ్ శంకర్

By

Published : Jun 22, 2019, 11:00 AM IST

ప్రాక్టీస్​ సెషన్​లో గాయపడ్డ భారత ఆల్​రౌండర్​ విజయ్​ శంకర్​ కోలుకున్నాడు. అఫ్గాన్​తో మ్యాచ్​లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

ఇంగ్లాండ్​లో జరుగుతున్న ప్రపంచకప్​లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విజయ్ శంకర్. మేనేజ్​మెంట్​ ఏ బాధ్యతనిచ్చినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటమనేది ఒత్తిడి కాదు బాధ్యత అని పేర్కొన్నాడు.

"పరిస్థితిని బట్టి ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఎంత బలంగా ఆడాననేది కాదు. జట్టుకు ఎలా ఉపయోగపడాననేదే ముఖ్యం. 6,7 స్థానాల్లో బ్యాటింగ్​ చేసిన అనుభవం ఉంది. ఇక్కడ ఒత్తిడేమీ లేదు... బాధ్యత మాత్రమే ఉంది." -విజయ్ శంకర్, టీమిండియా క్రికెటర్

పాకిస్థాన్​పై అద్భుతంగా బౌలింగ్ చేసిన విజయ్ శంకర్.. తన తొలి ప్రపంచకప్​ మ్యాచ్​లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

విజయ్ శంకర్

"పాక్​పై ప్రదర్శన నాలోని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ముఖ్యంగా ఆ జట్టుపై ప్రపంచకప్​లో ఆడటం ప్రత్యేక అనుభవం. ఒత్తిడిని జయించి ఆడగలిగాను. చివరగా జట్టు గెలుపే నాకు ముఖ్యం." -విజయ్ శంకర్, టీమిండియా క్రికెటర్

అఫ్గాన్​తో మ్యాచ్​కు ముందు ఓ మీడియా కార్యక్రమంలో తన ఫిట్​నెస్​పై స్పష్టతనిచ్చాడు విజయ్ శంకర్. బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఇది చదవండి: ఫేవరెట్​తో పసికూన పోరు.. పోటీ ఎంత!

ABOUT THE AUTHOR

...view details