తెలంగాణ

telangana

By

Published : Oct 22, 2019, 5:19 AM IST

ETV Bharat / sports

'ఆటగాళ్ల ఎంపిక ముందు కోహ్లీతో మాట్లాడతా'

బంగ్లాదేశ్​తో జరిగే టీ20 సిరీస్​కు టీమిండియా సారథి కోహ్లీకి విశ్రాంతినిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించాడు సౌరవ్ గంగూలీ. అతడితో మాట్లాడాతానని తెలిపాడు.

గంగూలీ

తీరిక లేకుండా మ్యాచ్​లు ఆడుతున్న టీమిండియా సారథి కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలక్షన్ కమటీ భావిస్తోందని సమాచారం. అందువల్ల బంగ్లాదేశ్​తో త్వరలో జరిగే టీ20 సిరీస్​లో ఈ ఆటగాడికి రెస్ట్ ఇవ్వనుందన్న వార్తలూ వచ్చాయి. ఈ విషయంపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ. నిర్ణయం తీసుకునే హక్కు తనకుందని తెలిపాడు.

"అక్టోబర్​ 24న బీసీసీఐ అధ్యక్షుడిగా కోహ్లీని కలుస్తా. అప్పుడు ఈ విషయంపై మాట్లాడతా. విశ్రాంతి తీసుకోవాలనుకోవడం అతడి హక్కు."
-గంగూలీ, మాజీ ఆటగాడు

రోహిత్ శర్మపైనా ప్రశంసలు కురిపించాడు గంగూలీ.

"రోహిత్​ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. అతడో గొప్ప ఆటగాడని చెప్పనవసరం లేదు. అతడి సామర్థ్యం ఏంటో మనందరికీ తెలుసు."
-గంగూలీ, మాజీ ఆటగాడు

బంగ్లాదేశ్​తో నవంబర్ 3న ప్రారంభం కానున్న టీ20 సిరీస్​కు ఈనెల 24న ఆటగాళ్ల ఎంపిక జరగనుంది. కోహ్లీకి విశ్రాంతినివ్వాలని భావిస్తే రోహిత్ శర్మ సారథిగా వ్యవరిస్తాడు.

ఇవీ చూడండి.. రివార్డులు కావాలా నాయనా.. దానికి ఇదే దారి!

ABOUT THE AUTHOR

...view details