టీ20 ప్రపంచకప్‌లను వరుసగా నిర్వహించడం వల్ల ప్రేక్షకుల్లో వాటిపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ అన్నాడు. ప్రతి ప్రపంచకప్‌నకు మధ్య కనీస కాలవ్యవధి ఉండాలని అభిప్రాయపడ్డాడు. అయితే ఇలా వరుస టోర్నీల్లో ఆడేందుకు తమకు తగిన సమయం కూడా లేదని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.
"ప్రపంచకప్ ఆడకపోతే కచ్చితంగా దాన్ని మిస్ అయినట్టే ఉంటుంది. అయితే ఇటీవలే 2019లో వన్డే ప్రపంచకప్ ఆడాం. ప్రపంచకప్‌లను అధికంగా నిర్వహించడం సరైనది కాదని భావించిన ఐసీసీ.. 2016-2021 మధ్య వన్డే ప్రపంచకప్ తప్ప మరొక టోర్నీని నిర్వహించలేదు. అలాంటి పరిస్థితుల్లో వరల్డ్‌కప్ కోసం అభిమానుల ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచకప్‌లను విరామం లేకుండా నిర్వహించడం వల్ల ఆ టోర్నీలపై ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి తగ్గిపోవచ్చు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది కాబట్టి టోర్నీ కోసం మేమెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అంతకంటే ముందు మేమిక్కడ చేయాల్సిన పని చాలా ఉంది".
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా వైస్‌కెప్టెన్