ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై అతడి భార్య సాక్షి సింగ్ స్పందించింది. అవన్నీ కేవలం వదంతులేనని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడంటూ వస్తోన్న వార్తలపై టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టతనిచ్చాడు. అలాంటి సమాచారమేదీ మా వద్దకు రాలేదని చెప్పాడు.
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఇటీవలే ఎంపిక చేసిన టీ20 జట్టులో ధోనీకి అవకాశం కల్పించలేదు. మరికొంత కాలం మహీకి విశ్రాంతినిస్తున్నట్లు సెలక్టర్లు తెలిపారు. అయితే విశ్రాంతి పేరుతో కావాలనే పక్కకు పెడుతున్నారని సీనియర్ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఒక వేళ ధోనీని తప్పించాలనుకుంటే గౌరవంగా అతడికి వీడ్కోలు మ్యాచ్‌ను ఆడించాలని సూచిస్తున్నారు.
2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. 2017లో పరిమిత ఓవర్లలో కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
ఇవీ చూడండి.. కోహ్లీ పోస్ట్.. ధోనీ రిటైర్మెంట్కు సంకేతమా..!