ఇంగ్లాండ్ జట్టుతో స్నేహం అనే పదానికి చోటే లేదంటున్నాడు వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్. ఇదే విషయంపై ఇంగ్లీష్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు ఓ హెచ్చరిక జారీ చేశాడు. త్వరలో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టును ఓడించడమే లక్ష్యంగా తమ జట్టు కసరత్తులు చేస్తోందని తెలిపాడు. అందుకోసం అద్భుతమైన ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించాడు.
"ఈసారి జరగబోయే సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టుపై చెలరేగిపోతా. బాగా శ్రమించి గెలుపొందడమే మా జట్టు ధ్యేయం. ఇంగ్లీష్ జట్టుతో స్నేహానికి చేయి కలపం. ఇక జోఫ్రా ఆర్చర్ విషయానికొస్తే అతడికి అడ్డుకట్ట వేయడానికి ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కూడా రచించాం. ఈ యుద్ధం ఎప్పుడెప్పుడు జరగుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. మేము తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తున్నా."
-కీమర్ రోచ్, వెస్టిండీస్ బౌలర్