వచ్చే ఏడాది అనుకున్న సమయానికే ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పారు అంతర్జాతీయ ఒలింపిక్ సమన్వయ కమిటీ అధ్యక్షుడు పియరీ-ఆలివర్ బెకర్స్-వియుజెంట్. ఒకవేళ అలా కుదరని పరిస్థితిల్లో పూర్తిగా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడ్డి ఈ క్రీడల్ని మరోసారి అలా చేయడం కుదరదని అభిప్రాయపడ్డారు.
"వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కచ్చితంగా మెగాక్రీడలు అప్పుడే జరిగి తీరుతాయి. లేని పక్షంలో పూర్తిగా రద్దవుతాయి. ఇలా వాయిదా వేసుకుంటా వెళ్తే అయ్యే ఖర్చును ఊహించలేం. ఇందులో పాల్గొనే వేలాది మంది దృష్టిలో పెట్టుకునే దీనిపై నిర్ణయాన్ని తీసుకుంటాం"
- పియరీ-ఆలివర్ బెకర్స్-వియుజెంట్, ఐఓసీ సమన్వయ కమిటీ ఛైర్మన్