తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ ఆటగాళ్ల రికార్డులు అందుకోగలరా.. భవిష్యత్తులో సాధ్యమేనా! - murali

క్రికెట్​లో  ఎంతో మంది  ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తి ఒకరైతే, ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తి మరొకరు, అత్యధిక బ్యాటింగ్ సగటుతో మరొకరు.. ఇలా ఇంతవరకూ తమ రికార్డులు ఎవ్వరూ బద్దలు కొట్టలేని కొంతమంది ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం!

రికార్డుల వీరులు

By

Published : Mar 21, 2019, 8:06 AM IST

Updated : Mar 21, 2019, 12:04 PM IST

క్రికెట్​.. జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఇప్పటి వరకు గెలుపోటములకే పరిమితమైన ఈ క్రీడ రాను రాను రికార్డులు, నంబర్ల చుట్టూ తిరుగుతుందనడంలో సందేహం లేదు.. కొన్ని రికార్డులు ఇప్పటికే బద్దలవగా... ఇంతవరకూ ఎవరూ దరిచేరని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం!

199 శతకాలతో

జాక్ హాబ్స్

ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 199 శతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు జాక్ హాబ్స్. 834 దేశవాళీ మ్యాచ్​లాడిన ఈ ఇంగ్లీష్ ఆటగాడు 50 పైగా సగటుతో 61వేల 760 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 316 పరుగులు నమోదు చేశాడు. 61 అంతర్జాతీయ టెస్టులు ఆడాడు.

ఈ రికార్డులు అందుకోగలరా...

సచిన్

24 ఏళ్ల క్రికెట్ జీవితం, 664 అంతర్జాతీయ మ్యాచ్​లు 34వేల 357 పరుగులు, వంద సెంచరీలు.. ఇప్పటికే అర్థమయ్యుంటుంది అతనెవరో కాదు సచిన్ తెందుల్కర్ అని. ఈ రికార్డులు అందుకోడానికి ఎవరూ దరిదాపుల్లోనూ లేరు.

సర్ సగటు సాధ్యమా..

బ్రాడ్​మాన్

క్రికెట్ చరిత్రలో అత్యంత స్థిరంగా ఆడిన ఆటగాడు ఎవరంటే అది సర్ డాన్ బ్రాడమానే. 52 అంతర్జాతీయ టెస్టులాడిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడు 99.94 సగటుతో 6వేల 996 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డు అందుకోడానికి చాలా దూరంలో ఉన్నారు క్రికెటర్లు.

వికెట్ల రారాజు ముత్తయ్య..

ముత్తయ్య మురళీధరన్

1347 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ముత్తయ్య మురళీధరన్. టెస్టుల్లో 800, వన్డేల్లో 534, టీ 20ల్లో 13 వికెట్లు తీసిన ఈ శ్రీలంక బౌలర్ అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. 1001 వికెట్లతో రెండోస్థానంలో ఉన్న షేన్​వార్న్.. ముత్తయ్యకు చాలా దూరంలో ఆగిపోయాడు.

ఒక్క మ్యాచ్​లో 19 వికెట్లు..

జిమ్ లేకర్

1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్​లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ 19 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్​లో 9వికెట్లతో అదరగొట్టిన ఇంగ్లీష్ ఆటగాడు రెండో ఇన్నింగ్స్​లో పదికి పది తన ఖాతాలో వేసుకున్నాడు. 1999లో అనిల్ కుంబ్లే పాకిస్థాన్​పై పది వికెట్ల ఘనత సాధించాడు.

దేశవాళీలో అత్యధిక వికెట్లు..

విల్​ఫ్రెడ్​ రోడ్స్

ఇంగ్లండ్​కు చెందిన విల్​ఫ్రెడ్​ రోడ్స్ ఫస్ట్ క్లాస్ కెరీర్​లో 4వేల 204 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 39వేల 69పరుగులు చేసి బ్యాటింగ్​లోనూ సత్తా చాటాడు. ఎక్కువ సంవత్సరాలు క్రికెట్ ఆడిన రికార్డు కూడా ఈ ఇంగ్లీష్ ఆటగాడి పేరు మీదే ఉంది. 1899 నుంచి 1930 వరకు 30 ఏళ్లకు పైనా క్రికెట్​ ఆడాడు.

లారా నాలుగొందలు..

లారా

టెస్టు క్రికెట్​లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు బ్రయన్ లారా. 2004లో ఇంగ్లండ్​పై 400 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు.

ప్రపంచకప్​ హ్యాట్రిక్..

వరల్డ్​కప్​ను ఒక్కసారైనా ముద్దాడాలనేది ప్రతి జట్టు కల. అలాంటిది ఐదు సార్లు ప్రపంచకప్​ను అందుకుంది ఆస్ట్రేలియా. వరుసగా మూడు సార్లు ఈ కప్​ను కైవసం చేసుకుంది. 1987లో తొలిసారి ప్రపంచకప్​ను అందుకున్న ఆసీస్ అనంతరం 1999, 2003, 2007లోనూ కప్ సాధించింది. చివరిగా 2015లో మెగాటోర్నీ విజేతగా నిలిచింది..

చివరాఖరునొచ్చి సెంచరీ బాదాడు..

వాల్టర్ రీడ్

1884లో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 551 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 181కే 8 వికెట్లు కోల్పోయిన వేళ 10స్థానంలో బ్యాటింగ్​కి దిగిన వాల్టర్​ రీడ్ 117 పరుగులు చేసి మ్యాచ్​ చేజారకుండా కాపాడాడు. ఆఖరి స్థానంలో బ్యాటింగ్​కి వచ్చి ఎక్కువ పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రీడ్.

అతితక్కువ బౌలింగ్ సగటు..

జార్జ్ లోహమాన్

టెస్ట్ క్రికెట్​లో అతితక్కువ బౌలింగ్ సగటుతో రికార్డు నెలకొల్పాడు జార్జ్ లోహమాన్. 18 టెస్టులాడిన ఈ ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ 112 వికెట్లు తీసి తక్కువ మ్యాచ్​ల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు. 10.75 బౌలింగ్​ సగటుతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించాడు.

Last Updated : Mar 21, 2019, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details