కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రీడలన్నీ పునఃప్రారంభమవుతున్నాయి. ఇందులో క్రికెట్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా చాలా కాలంగా నిలిచిపోయిన భారత్-పాక్ సిరీస్‌పై స్పందించారు దాయాది దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇదే అదనుగా చూసి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.
వాస్తవ పరిస్థితులను చక్కదిద్దటం విస్మరించి.. భారత ప్రభుత్వ వైఖరి వల్లే ఇరు జట్ల మధ్య సిరీస్ జరగట్లేదని ఆరోపించారు ఇమ్రాన్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య మ్యాచులు జరిగితే.. మైదానంలో భయంకరమైన వాతవరణం ఏర్పడటానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. పాక్-భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను తిరిగి ప్రారంభించాలని అభిప్రాయడ్డాడు. తద్వారా ఈ సిరీస్ ద్వారా వచ్చిన నగదును కరోనా బాధితులకు వినియోగించాలని చెప్పాడు. అయితే దీనిపై స్పందించిన భారత్‌కు చెందిన పలువురు క్రికెటర్లు.. ఇది జరగదని కరాఖండిగా చెప్పారు.
అప్పుడే ఆడింది