ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనేందుకైనా సిద్ధమని.. అవకాశమొస్తే టెస్టుల్లో భారత జట్టుకు ఓపెనింగ్ చేయడానికైనా ఓకే అని యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ఈ విషయంలో.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ రవిశాస్త్రి పంచుకునే అనుభవాలు తనకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నాడు.
అండర్-19 జట్టుకు ఆడేటప్పుడు వాషింగ్టన్ టాప్ ఆర్డర్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్. అయితే ఆ తర్వాత ఫుల్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా మారిపోయాడు. భారత టీ-20 జట్టులో అతని ఎంపికకు అదే ఉపయోగపడింది.
కోచ్ రవిశాస్త్రి.. భారత జట్టుకు ఆడే రోజుల్లో అతడి అనుభవాలను మాతో పంచుకునేవాడు. ఆ విషయాలన్నీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేవి. అరంగ్రేటంలో స్పెషలిస్టు స్పిన్నర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, పదో స్థానంలో బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు. తర్వాతి రోజుల్లో ఓపెనర్‌గా మారాడు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. టెస్టుల్లో ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలంటే నాకెంతో ఇష్టం.
-వాషింగ్టన్ సుందర్, భారత బౌలర్.