తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీకి భారంగా అనిపిస్తే సారథ్యం రోహిత్​కు ఇవ్వాలి' - రోహిత్​ కెప్టెన్సీ

ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్..​ తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవడానికి టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మకు మంచి అవకాశమని చెప్పాడు పాక్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​. అదే సమయంలో బాధ్యతలు భారంగా అనిపిస్తే టీ20 కెప్టెన్సీని హిట్​మ్యాన్​కు అప్పజెప్పాలని కోహ్లీకి సూచించాడు.

kohli
కోహ్లీ

By

Published : Nov 18, 2020, 11:27 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మను ప్రశంసించాడు పాకిస్థాన్​ మాజీ పేసర్ షోయబ్​ అక్తర్​. హిట్​మ్యాన్​ను పరిమిత ఓవర్ల సిరీస్​కు కెప్టెన్​గా నియమించాలని వస్తోన్న వాదనలకు మద్దతు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్​ సిరీస్​లోని చివరి మూడు టెస్ట్​లకు సారథి కోహ్లీ దూరమవ్వగా.. ఐపీఎల్​​లో గాయపడిన రోహిత్​ శర్మ అందుబాటులో ఉండనున్నాడు. అయితే ఈ మ్యాచుల్లో.. తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవడానికి రోహిత్​కు మంచి అవకాశం లభించిందనన్నాడు. తాను చూసిన భారత గొప్ప బ్యాట్స్​మెన్స్​లో అతడు ఒకడని కొనియాడాడు.

కాగా, బయోబుడగలో ఎక్కువ కాలం ఉన్నందున ఐపీఎల్​లో కోహ్లీపై ఒత్తిడి స్పష్టంగా కనిపించినట్లు చెప్పాడు షోయబ్​. ఒకవేళ బాధ్యతలు అదనపు భారంగా అనిపిస్తే.. టీ20 కెప్టెన్సీని రోహిత్​కు అప్పగించాలని సూచించాడు.

ABOUT THE AUTHOR

...view details