తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అంపైర్​ నిర్ణయంతో కాదు.. గెట్​ అవుట్ అన్నందువల్లే' - చేతన్ చౌహాన్

1981నాటి ఎల్​బీడబ్ల్యూ వివాదంపై లిటిల్​ మాస్టర్​ సునీల్​ గావస్కర్ అసలు విషయం చెప్పాడు. వెళ్లిపో అంటూ ఆసీస్​ ఆటగాళ్లు వ్యాఖ్యలు చేయడంతోనే మైదానాన్ని వీడినట్లు స్పష్టం చేశాడు.

It wasn't LBW call but 'get lost' comment from Aussies that made me walk out in 1981: Gavaskar
'అంపైర్​ నిర్ణయం కాదు.. గెట్​ అవుట్ అన్నందువల్లే'

By

Published : Jan 1, 2021, 8:29 PM IST

Updated : Jan 1, 2021, 9:36 PM IST

మెల్​బోర్న్​లో 1981నాటి టెస్టులో వివాదాస్పద ఎల్​బీడబ్ల్యూ గురించి స్పష్టతనిచ్చాడు మాజీ కెప్టెన్​, క్రికెట్​ దిగ్గజం సునీల్​ గావస్కర్. అంపైర్​ ప్రకటనతో కాక ఆసీస్​ ఆటగాళ్ల వ్యాఖ్యల కారణంగానే మైదానాన్ని వీడినట్లు తెలిపాడు.

"ఎల్​బీడబ్ల్యూగా ప్రకటించినందుకు నేను అసంతృప్తి చెందాననే అపోహ ఉంది. అయితే ఆ నిర్ణయం బాధాకరం. చేతన్​ చౌహాన్​తో కలిసి మైదానాన్ని వీడడానికి ఆస్ట్రేలియన్లే కారణం. నేను చౌహాన్​ను దాటి డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్లే సమయంలో.. గెట్​అవుట్​ అంటూ వారు వ్యాఖ్యలు చేశారు. దాంతో వెనక్కు వచ్చి నాతో చౌహాన్​ను తీసుకెళ్లా."

-సునీల్​ గావస్కర్, భారత మాజీ ఆటగాడు

1981 సిరీస్​లో అంపైరింగ్​ లోపాల కారణంగా లిటిల్​ మాస్టర్​ పెవిలియన్​కు చేరాల్సి వచ్చింది. డెన్నిస్ లిల్లీ వేసిన బంతి గావస్కర్​ బ్యాట్​కు తట్టి ప్యాడ్​లను తాకింది. అయితే ఆస్ట్రేలియన్ల అప్పీల్​తో అంపైర్​ రెక్స్​ వైట్​హెడ్ ఔట్​గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తితో పిచ్​ను చాలాసేపు వీడలేదు.

ఆ తర్వాత ఆసీస్​ ఆటగాళ్లు గావస్కర్ దగ్గరకు గెట్​ అవుట్​ అంటూ చేసిన వ్యాఖ్యలతో ఉద్రేకం చెంది.. నాన్​ స్ట్రైకింగ్​ ఎండ్​లో ఉన్న చౌహాన్​ను కూడా వెంట రావాలని చెప్పాడు. ఇద్దరూ మైదానం వీడడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత చౌహాన్​ను వెనక్కు పంపించాడు టీమ్​ఇండియా మేనేజర్​ బాపు నంద్​కర్ని.

టీమ్​ఇండియాదే విజయం..

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఆ మూడో టెస్టులో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 1-1తో ముగించింది. తొలి టెస్టులో ఆసీస్‌ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 324 పరుగులు సాధించి ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్​కు.. గావస్కర్‌ (70), చేతన్‌ (85) తొలి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. వెంగసర్కార్‌ (41) కూడా రాణించడంతో ఆసీస్‌కు టీమిండియా 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి కంగారూల సేన 83 పరుగులకే కుప్పకూలింది.

ఇదీ చూడండి:'ఐదేళ్లు కొనసాగుతా.. రెండు ప్రపంచకప్​లలో ఆడతా'

Last Updated : Jan 1, 2021, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details