బాక్సింగ్ డే టెస్టు విజయంతో తాత్కాలిక కెప్టెన్ రహానెను ఆసీస్ దిగ్గజాలు ప్రశంసించడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని భారత మాజీ క్రికెటర్ గావస్కర్ అన్నాడు. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చాడు.
"ఆస్ట్రేలియా దిగ్గజాలు పాంటింగ్, గిల్‌క్రిస్ట్, మైక్ హస్సీ, షేన్ వార్న్ లాంటి స్టార్ ఆటగాళ్లు రహానెను పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైట్‌వాష్ అవుతుందని చెప్పిన కొందరు ఆసీస్ క్రికెటర్లకు ఈ విజయంతో భారత సరైనా సమాధానమిచ్చింది. టీమ్ఇండియా, ఓటమితో డీలా పడే జట్టు కాదు తిరిగి పుంజుకుని బలంగా ఢీ కొట్టే జట్టు"