2019 ఐపీఎల్లో తన ఫేవరెట్ మూమెంట్‌ను పంచుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ వికెట్ తీయడం అద్భుతంగా అనిపించిందన్నాడు. విరాట్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడం ఎప్పుడూ సంతోషమేనని తెలిపాడు.
2019 ఐపీఎల్ ద్వితీయార్ధంలో ఖలీల్‌కు జట్టులో ఆడే అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుని 9 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడీ లెఫ్టార్మ్ పేసర్.
ఈ సందర్భంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు ఖలీల్. తొలి ఓవర్లోనే పార్థివ్ పటేల్ ఔట్ అవ్వడం వల్ల క్రీజ్‌లోకి వచ్చాడు కోహ్లీ. రెండో ఓవర్లో ఖలీల్ బౌలింగ్‌లో ఓ ఫోర్, ఓ సిక్స్ దంచేశాడు. అయినప్పటికీ ఖలీల్ ఏకాగ్రతను కోల్పోలేదు. అదే ఓవర్ నాలుగో బంతికి స్లో లెన్త్ బాల్ వేశాడు ఖలీల్. మరోమారు దూకుడు ప్రదర్శిద్దామనుకున్న విరాట్.. కీపర్ వృద్ధిమాన్ సాహాకు దొరికిపోయాడు.
భారత క్రికెట్ జట్టు పేస్ విభాగంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు ఖలీల్.
ఇదీ చూడండి:-'ధోనీ క్రికెటర్‌గా ఎదిగిన తీరు అద్భుతం'