తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్-వెస్టిండీస్ మ్యాచ్​కు పకడ్బందీ ఏర్పాట్లు'

భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టీ20 వచ్చేనెల 6న హైదరాబాద్​లో జరగనుంది. ఈ మ్యాచ్​ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని హెచ్​సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు.

Azaharuddin
అజహరుద్దీన్

By

Published : Nov 28, 2019, 3:10 PM IST

హెచ్​సీఏ మీటింగ్

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. వచ్చే నెల 6న భారత్‌-వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌, ఉప్పల్ మైదానంలో జరుగుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ చెప్పారు. వాస్తవానికి ఈ మ్యాచ్ డిసెంబర్ 11న జరగాల్సి ఉండగా, ముంబయి క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు 6వ తేదీకి మార్చినట్లు తెలిపారు.

ఈ మ్యాచ్‌ తమ అడ్మినిస్ట్రేషన్‌కు మొదటి మ్యాచ్‌ అని చెప్పిన అజహర్.. పోలీసు భద్రత కోసం కమిషనర్‌తో మాట్లాడామని అన్నారు.

"భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. ప్రైవేటు సెక్యూరిటీని నియమిస్తాం. క్రీడాభిమానులకు మంచి సదుపాయాలు అందజేస్తాం. పార్కింగ్ సమస్య లేకుండా చేస్తాం. బార్​కోడ్ ద్వారా ప్రవేశం ఉంటుంది. మ్యాచ్ సందర్భంగా మెట్రో సర్వీసులను పెంచాలని కోరాం. మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన అభిమానులు ఒకవేళ అస్వస్థతకు గురైతే వైద్యం అందజేస్తాం"
-అజహరుద్దీన్, హెచ్​సీఏ అధ్యక్షుడు

వెస్టిండీస్​తో పరిమిత ఓవర్ల సిరీస్​లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టీ20 డిసెంబర్ 6న హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. రెండో, మూడో టీ20లు వరుసగా 8,11 తేదీల్లో జరగనున్నాయి.

ఇవీ చూడండి.. విరాట్ కోహ్లీకే నా మద్దతు: గంభీర్

ABOUT THE AUTHOR

...view details