న్యూజిలాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు గాయాల బెడద పెరిగింది. ఇప్పటికే శిఖర్ ధావన్ జట్టుకు దూరమయ్యాడు. తాజాగా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. దిల్లీ తరఫున ఆడుతున్న రంజీ మ్యాచ్‌లో అతడి పాదం మలుచుకుంది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో లంబూ మూడో ఓవర్ వేశాడు. ఫుల్ లెంగ్త్‌లో వేసిన బంతి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ప్యాడ్లకు తాకడం వల్ల అతడు అంపైర్ వైపు తిరిగి అప్పీల్ చేయబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడ్డాడు. పాదం మలుచుకుంది.
"ఇషాంత్ చీలమండ వాచింది. ప్రస్తుతానికి పరిస్థితి బాగాలేదు. ఈ మ్యాచులో మళ్లీ ఆడించి సాహసం చేయలేం. ఎలాంటి చీలిక లేదనే భావిస్తున్నాం. అది పూర్తిగా వాపే అయితే అతడు కొన్ని రోజుల్లో ఫిట్ అవుతాడు. ఇప్పటికైతే ఎన్‌సీఏ వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిందే. పునరాగమనం చేసేందుకు ధ్రువపత్రం తీసుకురావాల్సిందే. ఎంఆర్‌ఐ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాం."
-దిల్లీ జట్టు యాజమాన్యం సభ్యుడు