తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండురోజుల్లో 4 గంటలే పడుకున్న ఇషాంత్ - cricket news

న్యూజిలాండ్​తో టెస్టు ఆడుతున్న భారత్ బౌలర్ ఇషాంత్ శర్మ.. ఈ మ్యాచ్​కు ముందు రెండురోజుల్లో కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకున్నాడు. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు.

రెండురోజుల్లో 4 గంటలే పడుకున్న ఇషాంత్
భారత్ బౌలర్ ఇషాంత్ శర్మ

By

Published : Feb 22, 2020, 9:50 PM IST

Updated : Mar 2, 2020, 5:41 AM IST

రెండు రోజులుగా అతి కష్టమ్మీద కేవలం నాలుగు గంటలే నిద్రపోయానని టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ అన్నాడు. జెట్‌లాగ్‌ వేధిస్తున్నప్పటికీ జట్టు కోసం ఆడక తప్పడం లేదన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో బంతులు విసిరేందుకూ ఇబ్బంది పడ్డటప్పటికీ 3 వికెట్లు తీశాడీ బౌలర్.

కొన్ని రోజుల క్రితం రంజీ మ్యాచ్‌ ఆడుతూ ఇషాంత్‌ గాయపడ్డాడు. కుడికాలి మడమలో చీలికలు ఏర్పడటం వల్ల ఎన్‌సీఏలో రిహేబిలిటేషన్‌కు వెళ్లాడు. గాయం తీవ్రతను పరిశీలిస్తే కనీసం ఆరు వారాలైన విశ్రాంతి తీసుకోవాలని తెలిసింది. ఈ కారణం వల్ల అతడు కివీస్‌ టెస్టుకు ఎంపికవుతాడనే అనుకోలేదు. అనుకున్న సమయం కన్నా త్వరగా కోలుకోవడం వల్ల 24 గంటలు ప్రయాణం చేసి న్యూజిలాండ్‌ చేరుకున్నాడు. ప్రయాణ బడలిక నుంచి విశ్రాంతి తీసుకొనేందుకు అతడికి వీలు కాలేదు.

'రెండు రోజులుగా నేను నిద్రపోలేదు. ఈ రోజు నా శరీరం చాలా ఇబ్బంది పెట్టింది. కోరుకున్న విధంగా బంతులు విసరలేకపోయాను. విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా ఆడాల్సిందేనని వారు చెప్పారు. జట్టు కోసం ఆడక తప్పలేదు. నిన్నరాత్రి 40 నిమిషాలే పడుకున్నా. మ్యాచ్‌కు ముందురోజు 3 గంటలే నిద్రించా. ఎంత ఎక్కువసేపు నిద్రపోతే అంత త్వరగా అలసట నుంచి తేరుకోవచ్చు. శక్తిమేరకు ఆడొచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి నిద్రను మించి ఏముందీ' -ఇషాంత్‌ శర్మ

'ఎన్‌సీఏ సహాయక సిబ్బంది వల్లే త్వరగా గాయం నుంచి కోలుకున్నా. ఈ టెస్టు సిరీస్‌ ఆడతాననే అనుకోలేదు. గాయం తీవ్రతను చూసి 6 వారాలు విశ్రాంతి అవసరం అన్నారు. అందుకే కచ్చితంగా టెస్టు మ్యాచ్‌ ఆడాలని అనుకోలేదు. వీలు కుదిరితేనే చూద్దామనుకున్నా. ఎన్‌సీఏలో రెండు రోజులు 21 ఓవర్లు విసిరాను. దాంతో ఫిట్‌గా ఉన్నానని తెలుసుకున్నా. కివీస్‌కు రాగానే గంటన్నర సేపు బౌలింగ్‌ చేశా. అంతకుముందే 24 గంటలు ప్రయాణం చేయడం వల్ల నా శరీరంపై ప్రభావం చూపించింది' అని లంబూ చెప్పాడు.

మ్యాచులో బంతి రివర్స్‌స్వింగ్‌ కావడం లేదని ఇషాంత్‌ అన్నాడు. పిచ్‌ నుంచి సహకారం లభించడం లేదని చెప్పాడు. 40-50 ఓవర్ల తర్వాత కూకాబుర్ర బంతి సీమ్‌ మెత్తబడటం వల్ల అప్పుడిక బంతులు వేయాలంటే చాలా కష్టమని వెల్లడించాడు. అందుకే తాను క్రాస్‌సీమ్‌ ప్రయత్నించానని తెలిపాడు. వికెట్‌ మందకొడిగా మారిందని, తొలుత టెన్నిస్‌ బంతిలా బౌన్స్‌ అయిన బంతి ఇప్పుడు బ్యాటు మీదకు వస్తోందని వివరించాడు. తొలిసారి హామిల్టన్‌ వచ్చిన వారికి చల్లగాలులు వీస్తుంటే ఎలా బంతులు వేయాలో అవగాహన ఉందని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ ఆధిక్యం సాధించినా టీమిండియా బలంగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.

Last Updated : Mar 2, 2020, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details