న్యూజిలాండ్ పర్యటనను విజయాలతో ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత ఓటముల బాట పట్టింది. మూడు వన్టేల సిరీస్ను వైట్ వాష్ చేసుకున్న కోహ్లీసేన తొలి టీ20లోనూ ఓటమిపాలైంది. దీనిపై ఇప్పటికే అభిమానులు ఆగ్రహజ్వాలలతో ఉన్నారు. తాజాగా మయాంక్ అగర్వాల్ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఫ్యాన్స్ కోపానికి మరింత కారణమైంది.
'ఫోజులు ఆపి.. ఆటపై దృష్టి పెట్టండి' - 'పోజులు ఆపి.. ఆటపై దృష్టి పెట్టండి'
సామాజిక మాధ్యమాల వేదికగా టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
!['ఫోజులు ఆపి.. ఆటపై దృష్టి పెట్టండి' కోహ్లీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6207909-thumbnail-3x2-mat.jpg)
కోహ్లీ
ఈ ఫొటోలో కోహ్లీ, ఇషాంత్, మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్ ఉన్నారు. ఇప్పటికే కోపంతో ఊగిపోతున్న ఫ్యాన్స్ ఈ ఫొటోపై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. "పోజులివ్వడం ఆపి ఆటపై దృష్టిపెట్టండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. "మీరు పర్యటనకు వెళ్లింది క్రికెట్ ఆడటానికి కానీ షాపింగ్ చేయడానికి కాదు" అంటూ మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు.
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది టీమిండియా. రెండో టెస్టు ఈనెల 29న ప్రారంభంకానుంది.
Last Updated : Mar 2, 2020, 3:16 PM IST