తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గులాబీ బంతితో నా ప్రదర్శన వెనుక రహస్యం అదే'

డే/నైట్ టెస్టులో తొలిరోజు అదరగొట్టిన భారత బౌలర్ ఇషాంత్ శర్మ.. ఈ ప్రదర్శనకు జట్టులో ఉన్న ఆరోగ్యకర పోటీయే కారణమని చెప్పాడు. ఇషాంత్​ 22 పరుగులకే అయిదు కీలక వికెట్లు పడగొట్టాడు.

బౌలర్ ఇషాంత్ శర్మ

By

Published : Nov 23, 2019, 11:22 AM IST

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో భారత బౌలర్ ఇషాంత్ శర్మ.. 22 పరుగులిచ్చి 5 వికెట్లతో రాణించాడు. గులాబి బంతితో చెలరేగి, ప్రత్యర్థి జట్టు 106 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టీమిండియా బౌలర్ల మధ్య ఉన్న ఆరోగ్యకర పోటీనే ఈ ప్రదర్శనకు కారణమన్నాడు.

"మా (భారత బౌలర్లు) మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అదే, నా ప్రదర్శన మెరుగుపడేందుకు కారణమైంది. ఒకవేళ బౌలర్ల మధ్య పోటీ లేకపోతే చేసే పనిని ఆస్వాదించలేం. ఛాలెంజ్ విసిరే వారు ఎవరూ లేకపోతే, ప్రదర్శన ఆశించిన మేర ఉండకపోవచ్చు" -ఇషాంత్ శర్మ, భారత బౌలర్

ప్రస్తుతం 96వ టెస్టు ఆడుతున్న ఇషాంత్.. ఈ ఫార్మాట్​లో 287 వికెట్లు తీశాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇన్నింగ్స్​లో 5 వికెట్ల ఘనత సాధించాడు.

5 వికెట్లు తీసిన అనంతరం బంతిని చూపిస్తున్న భారత బౌలర్ ఇషాంత్ శర్మ

డే/నైట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 174 పరుగులతో నిలిచింది భారత్. 68 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 59, అజింక్య రహానే 23 ఉన్నారు.

ఇది చదవండి: పింక్​ టెస్టు: తొలిరోజు కోహ్లీసేనదే.. ఆధిక్యంలో భారత్​

ABOUT THE AUTHOR

...view details